Telugu Gateway
Politics

చంద్రబాబు వ్యాఖ్యలపై కెటీఆర్ ఫైర్

చంద్రబాబు వ్యాఖ్యలపై కెటీఆర్ ఫైర్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తన కింద పనిచేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే చేస్తున్న వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ మండిపడ్డారు. కెసీఆర్ మంత్రిగా పనిచేశారు తప్ప..మరొకటి కాదన్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చంద్రబాబు అప్పటి సీఎంల కింద పనిచేసినట్లా? అని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన అహంభావానికి నిదర్శనం అన్నారు. ఏపీ రాజకీయాలతో తమకు సంబంధం లేదని..అక్కడ ఎవరిని గెలిపించాలో..ఎవరిని ఓడించాలో అక్కడి ప్రజలు నిర్ణయం తీసుకుంటారన్నారు.

చంద్రబాబు పచ్చి అవకాశవాది అన్నారు. ఎన్నికల సమయంలో నేతలు పార్టీలు మారటం సహజమే అన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టడం విచిత్రంగా ఉందన్నారు. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీలు కూడా ఇతర పార్టీల నేతలకు కండువాలు కప్పుతున్నారన్నారు. జనసేన అధినేత పవన్ తెలంగాణలో ప్రచారం చేసుకున్నా తమకేమీ అభ్యంతరం లేదన్నారు. తెలంగాణలో తమకే అన్ని స్థానాలు వస్తాయని..ఇవి దేశంలోని కొన్ని జాతీయ పార్టీల కంటే ఎక్కువగానే ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు ఎన్టీఆర్ కంటే ఎక్కువ కెసీఆర్ నే ఎక్కువ తలచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Next Story
Share it