భువనగిరి ఎంపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి
BY Telugu Gateway16 March 2019 1:09 PM IST

X
Telugu Gateway16 March 2019 1:09 PM IST
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ అధిష్టానం ఆయన పేరును భువనగిరి లోక్ సభకు ఖరారు చేయనుంది. శనివారం విడుదల చేసే రెండవ జాబితాలో కోమటిరెడ్డి పేరు ఉండటం పక్కా అని చెబుతున్నారు. తొలుత భువనగిరి నుంచి పోటీ చేయాలని మధు యాష్కి భావించినా ..కోమటిరెడ్డి పోటీ చేయాలనుకోవడంతో వెనక్కి తగ్గారు. నిజామాబాద్ కు చెందిన మాజీ ఎంపీ భువనగిరి సీటు కోరటంపై కూడా వివాదం తలెత్తింది.
చివరకు ఆయనే వెనక్కి తగ్గారు. మధుయాష్కి వెనక్కి తగ్గడం, కోమటిరెడ్డి బలమైన నేత కావడంతో అధిష్టానం కోమటిరెడ్డి వైపే మొగ్గుచూపింది. 2018 తెలంగాణ ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలిచిన కోమటిరెడ్డి పరాజయం పాలైన విషయం తెలిసిందే. గతంలో తన ఓటమిపై ఆయన స్పందిస్తూ.. పార్లమెంట్ బరిలో నిలిచి తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Next Story