మంగళగిరి సీటుపై జనసేన ట్విస్ట్
BY Telugu Gateway25 March 2019 6:22 AM GMT

X
Telugu Gateway25 March 2019 6:22 AM GMT
ఏపీ రాజకీయాల్లో హాట్ సీట్ గా మారిన ‘మంగళగిరి’ విషయంలో జనసేన కొత్త ట్విస్ట్ ఇచ్చింది. పొత్తులో భాగంగా ఈ సీటును సీపీఐకి కేటాయించారు. వాస్తవానికి అక్కడ కాస్తో కూస్తో బలంగా ఉన్న సీపీఎం పార్టీ తమకు సీటు కేటాయించాలని కోరినా కాదన్న పవన్ సీపీఐకి ఇచ్చారు. తీరా ఇప్పుడు సడన్ గా అక్కడ జనసేన కూడా పోటీ చేస్తుందని అభ్యర్ధిని ప్రకటించారు.
దీంతో అవాక్కు అవటం సీపీఐ వంతు అయింది. జనసేన తరపున చల్లపల్లి శ్రీనివాస్ అనే నాయకుడిని పోటీలో పెడుతున్నట్లు జనసేన ప్రకటించింది. సీపీఐ తరఫున ముప్పాళ్ల నాగేశ్వరరావు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతుండగా.. చల్లపల్లి శ్రీనివాస్‌ను జనసేన ప్రకటించింది. బీ-ఫారాన్ని ఆదివారం అర్ధరాత్రి ఆయనకు అందజేసింది. మరి ఈ వ్యవహారంపై సీపీఐ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.
Next Story