Telugu Gateway
Politics

జనసేన విశాఖ ఎంపీ అభ్యర్ధిగా లక్ష్మీనారాయణ

జనసేన విశాఖ ఎంపీ అభ్యర్ధిగా లక్ష్మీనారాయణ
X

జనసేన మరో జాబితాను విడుదల చేసింది. అందులో సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణకు విశాఖపట్నం లోక్ సభ సీటు కేటాయించారు. దీంతో ఇంత కాలంగా లక్ష్మీనారాయణ కు ఎక్కడ సీటు కేటాయిస్తారనే సస్పెన్స్ కు తెరపడింది. దీంతో పాటు మరో ఎనిమిది అసెంబ్లీ సీట్లకు అభ్యర్ధులను ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం ఉత్తరం : పసుపులేటి ఉషా కిరణ్ , విశాఖపట్నం దక్షిణం : గంపల గిరిధర్ , విశాఖపట్నం తూర్పు : కోన తాతా రావు, భీమిలి: పంచకర్ల సందీప్, అమలాపురం : శెట్టిబత్తుల రాజబాబు, పెద్దాపురం : తుమ్మల రామ స్వామి ( బాబు ), పోలవరం : చిర్రి బాల రాజు, అనంతపురం శ్రీ టి.సి.వరుణ్ లకు సీట్లు కేటాయించారు.

Next Story
Share it