లోక్ సభ అభ్యర్ధులను ప్రకటించిన జనసేన
BY Telugu Gateway11 March 2019 9:11 PM IST
![లోక్ సభ అభ్యర్ధులను ప్రకటించిన జనసేన లోక్ సభ అభ్యర్ధులను ప్రకటించిన జనసేన](https://telugugateway.com/wp-content/uploads/2018/07/pawan-kalyan1.jpg)
X
Telugu Gateway11 March 2019 9:11 PM IST
అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు లోక్ సభ సీట్లకు అభ్యర్ధులను ప్రకటించారు. రాజమండ్రి ఎంపీగా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన తరపున బరిలో నిలబడనున్నారు. అమలాపురం ఎంపీగా ఓఎన్జీసీ మాజీ ఈడీ డీఎంఆర్ శేఖర్ పోటీచేస్తారని ఆ పార్టీ ప్రకటించింది. త్వరలోనే అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్ధుల తొలి జాబితాను కూడా జనసేన విడుదల చేయనుంది.
తొలి విడతలో 32 అసెంబ్లీ స్థానాలకు, 7 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. ఏప్రిల్ 11న అసెంబ్లీ, పార్లమెంట్‌లకు ఒకేసారి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.
Next Story