Telugu Gateway
Politics

డేటా చోరీ కేసు..అశోక్ కు కోర్టులో చుక్కెదురు

డేటా చోరీ కేసు..అశోక్ కు కోర్టులో చుక్కెదురు
X

హైకోర్టు ఆదేశాలతో డేటా చోరీ కేసు కొత్త మలుపు తిరిగింది. ఐటి గ్రిడ్ డైరక్టర్ అశోక్ తెలంగాణ పోలీసులు ఇఛ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణకు ఈ నెల 20కి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపు లాయర్ తమ నోటీసులకు అశోక్ సమాధానం ఇచ్చేలా అశోక్ కు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరగా..దీనిపై అశోక్ తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా కోర్టు మాత్రం నోటీసులకు సమాధానం చెప్పాలని ఆదేశించింది. అదే సమయంలో అశోక్ ను అరెస్టు చేయకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన తరపు లాయర్ చేసిన వాదనను ఇఫ్పుడే పరిగణనలోకి తీసుకోలేమని కోర్టు తేల్చిచెప్పింది. దీంతో అశోక్ తెలంగాణ పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోతే మాత్రం ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది.

అయితే ఇది నోటీసులకు అశోక్ ఇచ్చే సమాధానం..తెలంగాణ పోలీసులు దీనిపై ఎలా స్పందిస్తారు అన్న అంశాలపైనే ఆధారపడి ఉంటుంది. రాజకీయ పార్టీల ఆటలో తనను బలి పశువును చేశారని..తనకు ఇఛ్చిన నోటీసులు రద్దు చేయటంతోపాటు డేటా చోరీ కేసును ఏపీకి బదిలీ చేయాలన్న అశోక్ అభ్యర్ధలను కోర్టు ప్రస్తుతానికి పరిగణనలోకి తీసుకోలేదు. తదుపరి విచారణ జరిగే మార్చి 20వ తేదీ లోగా అశోక్ తెలంగాణ పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంటుంది. గడువులోగా ఆయన హాజరుకాకపోతే కోర్టులో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది.

Next Story
Share it