Telugu Gateway
Politics

కుటుంబరావు మీది గుడ్డి సర్కారా?

కుటుంబరావు మీది గుడ్డి సర్కారా?
X

హీరో మోహన్ బాబు నిజంగానే విద్యను వ్యాపారం చేశారనే అనుకుందాం. మరి ఐదేళ్ల పాటు చంద్రబాబునాయుడు సర్కారు ఏమి చేసింది. ఈ అక్రమాలను సరి చేసి విద్యార్దులకు న్యాయం చేయాలి కదా?. మన జోలికి రానంత వరకూ ఎవరెంత దోచుకున్నా మనం ఏమీ మాట్లాడం అన్న మాట. ఎవరైనా ప్రశ్నిస్తే ..అప్పుడు మాత్రమే వాళ్ల అక్రమాలను వెలుగులోకి తెస్తామన్న మాట. నిజంగా మోహన్ బాబు విద్యాసంస్థలు అక్రమాలు చేస్తూ ఉన్నా ఏమీ చేయలేదంటే చంద్రబాబు ప్రభుత్వం గుడ్డి సర్కారు అనుకోవాలా?. ఇంత కాలం కళ్లు మూసుకుని చూస్తూ కూర్చుందా?. ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు అడగగానే మోహన్ బాబు విద్యను వ్యాపారం చేశాడు. కాలేజీ దగ్గర చిన్న సైజు మాఫియా నడుతున్నాడు అని కొంత మంది సర్పంచ్ లు ఫోన్ చేశారని చెబుతున్నారు.

ఎన్ఆర్ఐ డొనేషన్లు..తీసుకుని...డాలర్లకు డాలర్లు వాడేసుకున్నారని ఆరోపిస్తున్నావు. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా సాగినప్పుడు చక్కదిద్దాల్సిన ప్రభుత్వం నిద్రపోయిందా?. ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలపై మాట్లాడగానే మోహన్ బాబులో లోపాలు అన్నీ బయటకు వచ్చాయా?. ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఏపీ, తెలంగాణలో విద్యా సంస్థలు నడుపుతున్న మీ మంత్రి నారాయణ అత్యంత నిజాయతీగా వ్యాపారం చేస్తున్నారా?. అందులో జరిగే అక్రమాలు ఏమీ ప్రభుత్వానికి తెలియవా?. అసలు నారాయణ, చైతన్య కాలేజీలు విద్యార్ధుల నుంచి వసూలు చేసే ఫీజులు ఎంత?. ఐటి శాఖకు చూపించే లెక్కలు ఎంత?. ఈ అక్రమాల దందా సర్కారుకు తెలియదా?. తెలియదు అనుకుంటే జనం నమ్ముతారా?.

Next Story
Share it