Telugu Gateway
Cinema

తమన్నా ‘ముద్దు’ కండిషన్లు

తమన్నా ‘ముద్దు’ కండిషన్లు
X

తమన్నా. టాలీవుడ్ లో దశాబ్దకాలంగా మెరుస్తున్న తార. అప్పుడప్పుడు వెనకడుగు వేసినా మళ్లీ ఏదో ఒక సినిమాతో వెలుగులోకి వస్తుంది. అందాల ఆరబోతపై ఏ మాత్రం అభ్యంతరం చెప్పని ఈ భామ తనకూ కొన్ని పరిమితులు ఉన్నాయని అంటోంది. పలు సినిమాల్లో మిల్కీ బ్యూటీ అందాల ఆరబోతను చూసి యువత కకావికలం అయ్యారు. అయితే ఆమె తెరపై ‘ముద్దు’ సీన్లకు మాత్రమే ససేమిరా అని చెబుతోందట. అయితే ఈ విషయంలో మాత్రం ఒక్కరికి మినహాయింపు ఉందని తేల్చేసింది. ఈ హీరోతో ఛాన్స్ వస్తేనే ఈ ముద్దు కండిషన్లను పక్కన పెడతానని తేల్చిచెప్పింది.

ఆయన ఎవరో తెలుసా?. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. త‌మ‌న్నాకు హృతిక్ రోష‌న్ అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. హృతిక్‌తో క‌లిసి నటించే అవ‌కాశం వ‌స్తే అత‌నితో లిప్‌లాక్ సీన్లు చేయ‌డానికి త‌న‌కేం అభ్యంత‌రం లేద‌ని త‌మ‌న్నా చెప్పింది. గ‌తంలో ఒక‌సారి హృతిక్‌ను క‌లిసి ఫోటో దిగిన‌పుడు చాలా సంతోషించానని చెబుతుందీ ఈ భామ. చాలా మంది హీరోయిన్ల లిప్ లాక్ సీన్లు అలవోకగా చేసేస్తుంటే..తమన్నా మాత్రం ఆ సీన్లు తనకు ఏ మాత్రం కంఫర్ట్ గా ఉండవని తేల్చి చెప్పేసింది.

Next Story
Share it