Telugu Gateway
Politics

మరి చంద్రబాబు ఇప్పుడు ఏమంటారో?

మరి చంద్రబాబు ఇప్పుడు ఏమంటారో?
X

కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏ బీ వెంకటేశ్వరరావుతోపాటు ఇద్దరు ఎస్పీలను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఈసీ కూడా ప్రధాని మోడీ చెప్పినట్లు నడుచుకుంటోందని..ప్రతిపక్షం ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారా? అంటూ మండిపడ్డారు. దేశంలో వ్యవస్థలు అన్నింటిని మోడీ భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఈసీ నిర్ణయాన్ని ఆగమాఘాల మీద హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. అయితే చంద్రబాబు సర్కారుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మరి ఇప్పుడు చంద్రబాబు ఏమంటారో?. కోర్టులపై కూడా చంద్రబాబు విమర్శలు చేస్తారా?. వేచిచూడాల్సిందే. హైకోర్టు ఆదేశాలతో ఏపీ సర్కారు ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందుకు సంబంధించి ప్రభుత్వం శుక్రవారం జీవో నంబర్‌ 750 జారీ చేసింది. ప్రస్తుత ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ఎటువంటి ఎన్నికల విధులను ఏబీ వెంకటేశ్వరరావుకు అప్పగించవద్దంటూ జీవోలో పేర్కొంటూ.. హెడ్‌ క్వార్టర్స్‌ లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో సీఎం, ఏబీ వెంకటేశ్వరరావులు సమావేశం అయ్యారు. చంద్రబాబు సర్కార్‌ ... వెంకటేశ్వరరావును బదిలీ చేయకుండా ఉండేందుకు చివరకు ప్రయత్నాలు సాగించారు. ఈసీ ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. బదిలీలపై ఏపీ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం ఈసీ ఆదేశాలను శిరసావహించాల్సిందేనని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

Next Story
Share it