Telugu Gateway
Politics

టీఆర్ఎస్ లో హరీష్ ఇప్పుడు ‘స్టార్’ కాదట

టీఆర్ఎస్ లో హరీష్ ఇప్పుడు ‘స్టార్’ కాదట
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో మాజీ మంత్రి హరీష్ రావు ఇఫ్పుడు అత్యంత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారనే విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమం సమయంలో ముఖ్య భూమిక పోషించిన హరీష్ రావును ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ పక్కక పెట్టేశారు. కెసీఆర్ పక్కన పెట్టేశారు అనగానే ఆ పార్టీ నాయకులు కూడా అదే లైన్ లో పయనిస్తున్నారు. పేజీలకు పేజీలు ఇఛ్చే ప్రకటనల్లో ఒకప్పుడు ప్రముఖంగా కన్పించిన హరీష్ రావు చిన్న ఫోటోను కూడా ఇప్పుడు పెట్టడం లేదు. టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లోక్ సభ ఎన్నికల్లో హరీష్ రావును పూర్తిగా పక్కన పెట్టేశారు.

ఆయన కేవలం తన నియోజకవర్గంపైనే ఫోకస్ పెడుతున్నారు. తాజాగా ఎన్నికల సంఘానికి ఇచ్చిన టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో హరీష్ కు చోటు దక్కలేదు. సీఎం కెసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ తోపాటు..సంతోష్ కుమార్ కూడా ఉన్నారు కానీ హరీష్ పేరు లేదు. అత్యంత కీలక సమయంలో పార్టీలోనే లేని వారు ఇప్పుడు ‘స్టార్లు’ అయ్యారు. ఒకప్పుడు టీఆర్ఎస్ స్టార్ గా ఉన్న హరీష్ రావు ఆ జాబితాలో లేకుండా పోయారు. రాజకీయాలు ఎంత నిర్దయగా ఉంటాయో చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి?.

Next Story
Share it