Telugu Gateway
Politics

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కెసీఆర్ రెడీ

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కెసీఆర్ రెడీ
X

అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య మెజారిటీతో గెలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) లోక్ సభ ఎన్నికల్లోనూ అదే జోష్ చూపించేందుకు రెడీ అవుతోంది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ నేరుగా ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. దీనికి సంబంధించి తొలి విడత పర్యటనలు ఖరారు అయ్యాయి. ఈ నెల 17న కరీంనగర్, 19 నిజామాబాద్ లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి సభకు రెండు లక్షలకు తక్కువ కాకుండా జన సమీకరణ చేయాలని కెసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. అదే సమయంలో ఎంపీలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదే అని తేల్చిచెప్పారు.

ఎంఐఎంతో కలసి టీఆర్ఎస్ తెలంగాణలోని మొత్తం 17 సీట్లను దక్కించుకోవాల్సిందే అంటూ స్పష్టం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని కకావికలం చేస్తున్న కెసీఆర్ లోక్ సభ ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయం కోసం సన్నాహాలు మొదలుపెట్టారు. ఇంకా అభ్యర్దులను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సోమవారం నాడు కెసీఆర్ హైదరాబాద్ లో ఎమ్మెల్యేలతో భేటీ అయి...ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో అనుసరించాల్సిన విధానంతో పాటు..లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలపై చర్చించారు.

Next Story
Share it