టీఆర్ఎస్ కు వివేక్ రాజీనామా
BY Telugu Gateway22 March 2019 4:23 PM GMT

X
Telugu Gateway22 March 2019 4:23 PM GMT
లోక్ సభ ఎన్నికల ముందు తెలంగాణలోని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు ఝలక్. ప్రభుత్వ సలహాదారు జి. వివేక్ తన పదవికి రాజీనామా చేశారు. తనకు పెద్దపల్లి లోక్ సభ సీటు ఇస్తామని హామీ ఇచ్చి..ఇవ్వనందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆయన సీఎం కెసీఆర్ కు పంపిన లేఖలో పేర్కొన్నారు. సలహాదారుగా పనిచేసిన సమయంలో తాను ప్రభుత్వం నుంచి ఎలాంటి వేతనం కానీ..ఇతర ప్రయోజనాలు ఏమీ పొందలేని తన లేఖలో పేర్కొన్నారు.
తన రాజీనామాను సత్వరమే ఆమోదించాలని కోరారు. పెద్దపల్లి సీటు వివేక్ కే దక్కుతుందని అందరూ భావించారు. కానీ కెసీఆర్ అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన వెంకటేష్ నేతగానికి అప్పటికప్పుడే టిక్కెట్ కేటాయించి అందరినీ ఆశ్చర్యపర్చారు. వివేక్ తన భవిష్యత్ కార్యక్రమాన్ని శనివారం నాడు ప్రకటించే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Next Story