Telugu Gateway
Politics

విమానంలో ‘ఫైటింగ్’

విమానంలో ‘ఫైటింగ్’
X

బస్సుల్లో..రైళ్ళలో ఫైటింగ్ లే అరుదు. కానీ అక్కడ ఏకంగా విమానంలోనే ‘ఫైటింగ్’ జరిగింది. అందులో ఏకంగా 32 మంది గాయపడ్డారు. విమానం గాల్లో ఉండగానే అందులోని ప్రయాణికులు ఘర్షణకు దిగిన ఘటన కలకలం రేపింది. ఇస్తాంబుల్‌ నుంచి న్యూయార్క్‌ బయలుదేరిన టర్కీష్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో చోటుచేసుకుంది. విమానం మరో గంటలో న్యూయార్క్‌ జాన్‌ ఎఫ్‌ కెన్నడీ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతుందన్న సమయంలో ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది. ప్రయాణికులు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో విమానంలో షాకింగ్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ఫ్లైట్‌ సిబ్బందికి కూడా గాయాలైనట్టుగా సమాచారం. ఘర్షణ తర్వాత విమానం జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ అయింది.

ఈ ఘటనపై న్యూయార్క్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికార ప్రతినిధి స్టీవ్‌ కోల్‌మన్‌ మాట్లాడుతూ.. ‘ది బోయింగ్‌ 777 విమానం 326 ప్రయాణికులు, 21 మంది సిబ్బందితో ఇస్తాంబుల్‌ నుంచి న్యూయార్క్‌ కు బయలుదేరింది. విమానం ఎయిర్‌పోర్ట్‌ లో ల్యాండ్‌ అయ్యే 45 నిమిషాల మందు విమానంలో భయానక పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. గొడవ పడుతున్న వారిని చూసి మిగత ప్రయాణికులు కూడా ఆందోళన చెందారు. మొత్తం 32 మంది గాయపడగా.. వారిలో కొందరిని అధికారులు చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనతో ఇతర విమానాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని తెలిపారు.

Next Story
Share it