జనసేన టీడీపీ అనుబంధ పార్టీనా?
BY Telugu Gateway18 March 2019 5:28 AM GMT

X
Telugu Gateway18 March 2019 5:28 AM GMT
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జనసేనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు...సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేనలో చేరిన తర్వాత మాట్లాడిన లక్ష్మీనారాయణ తాను కూడా జనసైనికుల్లో ఒకరిగా మారిపోయానని వ్యాఖ్యానించారు. దీనిపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..మీరు ఇఫ్పుడు సైనికుడుగా మారటం ఏంటి?
మొదటి నుంచి చంద్రబాబు జవానే కదా మీరు అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. ఆయన ఆదేశాల ప్రకారమే నడుచుకున్నారని విమర్శించారు. పచ్చ పార్టీలో చేరితే ప్రజలు ఛీకొడతారని అనుబంధ సంస్థలో చేరారు. ఇన్నాళ్లు ఎవరి కోసం పనిచేసారో, ఇకపై ఏం చేస్తారో తెలియదనుకుంటే ఎలా? అంటూ ట్వీట్ చేశారు. మరి దీనిపై లక్ష్మీనారాయణ కానీ జనసేన స్పందిస్తుందో లేదో వేచిచూడాల్సిందే.
Next Story