Telugu Gateway
Politics

ఎన్నికల షెడ్యూల్ ఇదే

ఎన్నికల షెడ్యూల్ ఇదే
X

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఇక మిగిలింది రాజకీయ పార్టీల మధ్య ఫైటింగే. ఫలితాలు మాత్రం మే 23న వెల్లడికానున్నాయి. ఏప్రిల్‌ 11న జరిగే తొలివిడతలో 20 రాష్ట్రాల్లోని 91 స్ధానాలకు పోలింగ్‌ జరగనుంది. రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 115 స్ధానాలకు, మూడవ దశలో 14 రాష్ట్రాల్లోని 115 స్దానాలకు పోలింగ్‌ జరుగుతుంది. ఇక నాలుగో దశలో 9 రాష్ట్రాల్లోని 71 స్దానాలకు, ఐదో దశలో 5 రాష్ట్రాల్లోని 51 స్ధానాలకు పోలింగ్ జరుగుతుందని ఈసీ వెల్లడించింది. ఇక ఆరో దశలో ఏడు రాష్ట్రాల్లోని 59 స్ధానాలకు, తుది ఏడవ దశలో 8 రాష్ట్రాల్లోని 59 స్ధానాలకు పోలింగ్‌ జరుగుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో తొలి దశలోనే ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుంది.

ఒకే విడతలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు

ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణ

అరుణాచల్‌ ప్రదేశ్‌

గోవా

గుజరాత్‌

హర్యానా

హిమాచల్‌ ప్రదేశ్‌

కేరళ

మేఘాలయ

మిజోరాం

నాగాలాండ్‌

పంజాబ్‌

సిక్కిం

తమిళనాడు

ఉత్తరాఖండ్‌

అండమాన్‌ నికోబార్‌

దాద్రా నగర్‌ హవేలి

డయ్యుడామన్‌

లక్ష్యద్వీప్‌

న్యూఢిల్లీ

పాండిచ్చేరి

చంఢీగఢ్‌

రెండు విడతల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు

కర్ణాటక

మణిపూర్‌

రాజస్తాన్‌

త్రిపుర

మూడు విడతల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు

అస్సాం

చత్తీస్‌గఢ్‌

నాలుగు విడతల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు

జార్ఖండ్‌

మధ్యప్రదేశ్‌

మహారాష్ట్ర

ఐదు విడతల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు

జమ్మూ కశ్మీర్‌

ఏడు విడతల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు

ఉత్తర్‌ ప్రదేశ్‌

బిహార్‌

పశ్చిమ బెంగాల్‌

Next Story
Share it