Telugu Gateway
Politics

సైబర్ క్రైమ్ పుట్టిందే జగన్ ఇంట్లో

సైబర్ క్రైమ్ పుట్టిందే జగన్ ఇంట్లో
X

డేటా చోరీ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు హైదరాబాద్ లో గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసిన వ్యవహారంపై ఏపీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. సీఎం చంద్రబాబు సైబర్ క్రైమ్ కు పాల్పడ్డారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అసలు దేశంలో సైబర్ క్రైమ్ పుట్టిందే జగన్ ఇంట్లో అని ధ్వజమెత్తారు.

సైబర్ క్రైమ్ కు కేరాఫ్ అడ్రస్ జగన్..జగన్ కు ఇలా నేరాలు చేయటం బాగా తెలుసు అని వ్యాఖ్యానించారు. పదో తరగతి పరీక్షా పత్రాలు ఎత్తుకెళ్ళింది జగనే. ఆ తర్వాత దోపిడీని లక్షల కోట్లకు పెంచావ్. చోరీల్లో నీ ర్యాంగ్ ఏ1. బ్రదర్ అనిల్ వీఎస్ఎన్ఎల్, బీఎస్ ఎన్ ఎల్ కు కన్నం వేసి ఆరవై కోట్లు కొట్టేశాడు అని ఆరోపించారు.

Next Story
Share it