Telugu Gateway
Politics

అభివృద్ధి టీడీపీ కావాలా..అరాచక వైసీపీ కావాలా?

అభివృద్ధి టీడీపీ కావాలా..అరాచక వైసీపీ కావాలా?
X

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వ్యతిరేకులు గత ఐదేళ్ళ కాలంలో గణనీయంగా తగ్గుముఖం పట్టారని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తటస్థుల్లో కూడా టీడీపీ వైపే మొగ్గు కన్పిస్తోందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే టీడీపీ కావాలా? అరాచకాలు సృష్టించే వైసీపీ కావాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సోమవారం నాడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు వ్యాఖ్యలు....‘ఎన్నికల్లో టిడిపికి ఊహించని ఆధిక్యతలు వస్తాయి. నీళ్లిచ్చాం, ఖర్చులు తగ్గించాం, రైతుల రాబడి పెంచాం. రేషన్ పెంచాం. పండుగకానుకలు,అన్న క్యాంటిన్లు పెట్టాం. ఫీజులు చెల్లించాం. ఉపాధి కల్పించాం. గౌరవం పెంచాం. పెళ్లికానుకలు,పసుపు కుంకుమ. 10రెట్ల పించన్లు ఇచ్చాం. ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇళ్లు నిర్మించాం, భరోసా పెంచాం ప్రతిఇంట్లో అయిదారు రకాల ప్రభుత్వ లబ్ది అందింది. ఇన్నిచేసిన టిడిపికి కాక మరోపార్టీకి ఓటెలా వేస్తారు..? వైసిపికి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోతుంది.

వైసిపికి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ అప్రదిష్ట పాలవుతుంది. వైసిపికి ఓటేస్తే దాడులు-దౌర్జన్యాలు పెరుగుతాయి. వైసిపికి ఓటేస్తే, భూములు-ఆస్తులకు భద్రత ఉండదు. అమానుషాలకు పాల్పడేవారికి ఓటడిగే హక్కేలేదు. పోలవరం పూర్తి చేసే తెలుగుదేశం పార్టీ కావాలా..? పోలవరానికి కేసులతో అడ్డంకులు పెట్టే వైకాపా కావాలా..? రాజధాని నగర నిర్మాణం పూర్తి చేసే టిడిపి కావాలా..? అరటితోటలు తగులపెట్టి అరాచకం చేసే వైసిపి కావాలా..? రాయలసీమకు నీళ్లిచ్చే తెలుగుదేశం పార్టీ కావాలా..?ఫాక్షన్ రెచ్చగొట్టి ప్రజల ప్రాణాలు బలిచేసే వైసిపి కావాలా..? నీళ్లిచ్చిన తెలుగుదేశానికి కాక మరెవరికి ఓటేస్తామని ప్రశ్నించాలి. పోలవరంపై పిటిషన్లు వేసేవాళ్లకు ఏపిపై మాట్లాడే హక్కు లేదు. ఆంధ్రా వ్యతిరేకులతో అంటకాగే పార్టీకి ప్రజలే బుద్దిచెప్పాలి’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it