Telugu Gateway
Politics

కె పాల్ వెనక చంద్రబాబు?!

కె పాల్ వెనక చంద్రబాబు?!
X

కె ఎ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ వెనక తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారా?. అసలు పాల్ కు...చంద్రబాబుకు సంబంధం ఏంటి అంటారా?. అక్కడే ఉంది అసలు సంగతి. కె ఎ పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం హెలికాఫ్టర్ గుర్తు కేటాయించింది. వైసీపీకి చెందిన ఫ్యాన్..హెలికాఫ్టర్ ఫ్యాన్ ఓకేలా ఉండటంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తాజాగా ముగిసిన తెలంగాణ ఎన్నికల్లో కారు..ట్రక్కు గుర్తు సామీప్యతల కారణంగా టీఆర్ఎస్ పలు చోట్ల సీట్లు, చాలా చోట్ల ఓట్లు నష్టపోయింది. అదే పరిస్థితి ఎదురుకాకుండా వైసీపీ ఫిర్యాదు అయితే చేసింది. వైసీపీ ఫిర్యాదుపై స్పందిస్తే కె ఎ పాల్ స్పందించాలి. నా గుర్తుపై మీకేమి అభ్యంతరం అని వైసీపీని ప్రశ్నించాలి. కానీ అసలు అధ్యక్షుడు పాల్ కంటే ముందు టీడీపీ అధినతే చంద్రబాబు వైసీపీ ఫిర్యాదుపై స్పందించటంతో కె ఏ పాల్ వెనక చంద్రబాబు ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బుధవారం నాడు పార్టీ నేతలతో చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ‘హెలికాప్టర్’ గుర్తు చూసి కూడా జగన్ కు భయం.

‘హెలికాప్టర్’ పై ఫ్యాన్ ఉందంటూ ఈసికి ఫిర్యాదు’ చేశారంటూ వ్యాఖ్యానించారు బాబు. పాల్ కు లేని టెన్షన్ చంద్రబాబుకు ఎందుకు? అంటే ఈసీ స్పందించి ఈ గుర్తు మారిస్తే వైసీపీకి మేలు జరుగుతుందనే భయం చంద్రబాబు మాటల్లో స్పష్టంగా కనపడుతోంది. అంతే కాదు..పాల్ కు ఏపీలో ఓట్లు పడితే అవి ఎక్కువగా క్రిష్టియన్ ఓట్లే అని ఓ అంచనా ఉంది. ఏపీలో క్రిష్టియన్లు ప్రస్తుతం మెజారిటీ వైసీపీ పక్కనే ఉన్నారు. పాల్ ను రంగంలోకి దింపి కొన్ని ఓట్లను అయినా చీల్చి జగన్ ను దెబ్బతీయాలనే ప్లాన్ తో పాల్ కు ‘ఫండింగ్’ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా పాల్ పార్టీ గుర్తుపై వైసీపీ ఫిర్యాదు చేస్తే ఆయన కంటే ముందు చంద్రబాబు స్పందించటంతోనే అసలు రంగు బయటపడలేదా?.

Next Story
Share it