Telugu Gateway
Politics

మోడీని వ్యతిరేకించటానికి కూడా యాడ్ ఇవ్వాలా?

మోడీని వ్యతిరేకించటానికి కూడా యాడ్ ఇవ్వాలా?
X

ఏపీ ప్రజల సొమ్మును తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా దుబారా చేస్తున్నారో చెప్పటానికి ఇది ఓ మచ్చుతునక. కేంద్రం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పుడు అప్పుడు కేంద్ర మంత్రులుగా ఉన్న వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలను సన్మానించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టి..కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది ఏపీ సర్కారు. అసెంబ్లీ సాక్షిగా తీర్మానాలు కూడా చేసింది. ఇదంతా పాత కథ. ఎన్డీయే నుంచి టీడీపీకి బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రతి రోజూ టెలికాన్ఫరెన్స్ తోపాటు ప్రతి మీటింగ్ లో ఏమి చెబుతున్నారో అదే విషయాలను మళ్ళీ కోట్ల రూపాయల ఖర్చుతో అన్ని పత్రికలకూ కోట్లాది రూపాయలు వ్యయం చేస్తూ ప్రకటనలు ఇఛ్చారు. ప్రధాని నరేంద్రమోడీ విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారనే ఏకైక కారణంతో పత్రికలకు ఈ యాడ్ విడుదల చేయటం ద్వారా తాను ప్రధాని మోడీని ఎదురిస్తున్న ధీరుడిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.

మోడీపై పోరాటానికి ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బును ఇలా యాడ్స్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా? అని ప్రభుత్వ వర్గాలే నివ్వెరపోతున్నాయి. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన నవనిర్మాణ దీక్షలు..ధర్మ పోరాట దీక్షలపై చేసిన ఖర్చుతో ఓ చిన్న సైజు నీటిపారుదల ప్రాజెక్టు పూర్తయ్యేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఓ వైపు రాష్ట్రం కష్టాల్లో ఉందని..కేంద్రం ఆదుకోవటంలేదని నిత్యం చెబుతూనే చంద్రబాబు మాత్రం తన ప్రచారం విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. ఇలా తనకు కావాల్సిన వాళ్ళను ప్రసన్నం చేసుకుంటేనే కదా..ఎన్ని స్కాంలు చేసినా అవి వెలుగులోకి రాకుండా ఆ పత్రికలు ఆపేది?.

Next Story
Share it