Telugu Gateway
Politics

అప్పుడే నారా లోకేష్ పోటీ చేసి ఉంటే...అమ్మో!

అప్పుడే నారా లోకేష్ పోటీ చేసి ఉంటే...అమ్మో!
X

నారా లోకేష్ దొడ్డి దారిన రాజకీయాల్లోకి వచ్చారు..దొడ్డిదారిన వచ్చారు. చంద్రబాబు తన కొడుకును దొడ్డిదారిన రాజకీయాల్లోకి తెచ్చుకున్నారు అని అందరూ ఆయన్ను ఆడిపోసుకన్నారు ఇంతకాలం. చేతనైతే ఎన్నికల బరిలో నిలబెట్టి మంత్రి పదవి ఇవ్వాలి కానీ..ఇలా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి చేయటం ఏమిటి?. ఇదెక్కడి రాజకీయం అంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. కానీ చంద్రబాబు నిర్ణయం ఎంత కరెక్ట్ అన్నది నారా లోకేష్ మంగళగిరి ప్రచారం చూసిన తర్వాత కానీ రాష్ట్ర ప్రజలకు అర్థం కాలేదు. ఇప్పటివరకూ అస్మదీయ మీడియాను అడ్డం పెట్టుకుని ఈ రెండున్నర సంవత్సరాలు నారా లోకేష్ ను ఓ సక్సెస్ ఫుల్ మంత్రిగా..ఓ సక్సెస్ పుల్ లీడర్ గా చూపించుకోగలిగారు. అందరూ చెప్పినట్లు నారా లోకేష్ ను ఏదో ఒక నియోజకవర్గం నుంచి రెండు..మూడేళ్ల క్రితమే పోటీ చేయించి ఉంటే పరిస్థితి ఏంటి?. ఇప్పుడు మంగళగిరిలో జరుగుతున్న విచిత్రాలు అన్నీ అప్పుడే బయటకు వచ్చేవి. నారా లోకేష్ అసలు విషయం బయటకు తెలిసేది.

అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతున్నాయో పోటీ చేసే క్యాండిడేట్ కే తెలియదు. అసలు ఓడరేవు ఎక్కడ కడతారో కూడా తెలియదు?. ఎవరైనా చనిపోతే ఏమి చెప్పాలో కూడా తెలియదు. ఈ సీన్లు అన్నీ రెండున్నరేళ్ల క్రితమే బయటపడితే నారా లోకేష్ పరిస్థితి ఏంటి?. చంద్రబాబుకు నారా లోకేష్ విషయంలో చాలా క్లారిటీ ఉంది కాబట్టే ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇఛ్చారని..ఈ విషయం అర్ధం చేసుకోకుండా ఇంత కాలం ఆయనపై అనవసర విమర్శలు చేశారని ఓ టీడీపీ సీనియర్ నేతే వెటకారంగా వ్యాఖ్యానించారు. గత ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ చేసిన ఫీట్లకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బహిరంగంగా ఇంత జరుగుతున్నా కూడా అస్మదీయ మీడియా వాటన్నింటిని కప్పెట్టి లోకేష్ ను సూపర్ హీరోగా ప్రొజెక్ట్ చేసే పనిలో మునిగితేలుతున్నాయి. ఎటుపోయి ఎటు వస్తుందో అన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగానే నారా లోకేష్ కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండానే బరిలోకి దూకారు. లక్షలాది రూపాయల సర్కారు సొమ్ముతో సన్నిహితులకు సర్కారీ పదవులు కట్టబెట్టి ‘శిక్షకుల’ను నియమించుకున్నా వారు కూడా లోకేష్ ను మార్చలేకపోయారు పాపం.

Next Story
Share it