Telugu Gateway
Politics

చంద్ర‌బాబు అప్పుడ‌లా...ఇప్పుడిలా!

చంద్ర‌బాబు అప్పుడ‌లా...ఇప్పుడిలా!
X

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డ‌గానే తెలుగుదేశం అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు న‌వ్వుతూ మీడియా ముందుకు వ‌చ్చారు. మేం ఎన్నిక‌ల‌కు రెడీ అన్నారు. కానీ వాస్త‌వానికి షెడ్యూల్ చూసి తెలుగుదేశం పార్టీ షాక్ కు గురైంది. ఇంత త‌క్కువ స‌మయం ఉద్దేశ‌పూర్వ‌కంగా పెట్టార‌ని...ప్ర‌చారానికి స‌మ‌యం లేకుండా చేశార‌ని టీడీపీ నేత‌లు అంద‌రూ భావించారు. ఇదే విష‌యాన్ని బ‌య‌ట‌కు చెపితే ఓడిపోతామ‌నే భ‌యంతో ఇలా మాట్లాడుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తాయనే భ‌యంతో చంద్ర‌బాబు ఎన్న‌డూలేని విధంగా ఎక్క‌డా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డ‌కుండా ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించి వెళ్ళిపోయారు. చాలా వ‌ర‌కూ టిక్కెట్లు రెడీ అయ్యాయ‌ని అన్నారు. కానీ స‌డ‌న్ గా బుధ‌వారం నాడు మాత్రం అస‌లు విష‌యం చెప్పేశారు. లోప‌లి భ‌యాన్ని బ‌య‌ట పెట్టారు. న‌న్ను దెబ్బతీయాల‌నే తొలి ద‌శ‌లో ఎన్నిక‌లు పెట్టార‌ని. దీన్నే అవ‌కాశంగా మ‌ల‌చుకుంటాం అంటూ విలేక‌రుల స‌మావేశంలో వ్యాఖ్యానించారు.

షెడ్యూల్ ఎప్పుడు వ‌స్తుందో..ఎన్నిక‌లు ఎప్పుడు ఉంటాయో 40 సంవత్స‌రాల రాజ‌కీయ అనుభవం ఉన్న చంద్ర‌బాబుకు తెలియ‌దా?. ఎన్నిక‌ల షెడ్యూల్ పై రాజ‌కీయ విమ‌ర్శ‌లు ఉన్నాయి. అందులో సందేహం లేదు. మ‌రి ఓ వైపు మోడీతో నిత్యం పోరాడుతున్నాన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు అన్నింటికి అప్ర‌మ‌త్తంగా ఉండాలి క‌దా?. కానీ ఇప్పుడు వ‌చ్చి న‌న్ను దెబ్బ‌కొట్ట‌డానికి చూస్తున్నారు అని చెప్ప‌టం వ‌ల్ల ఉప‌యోగం ఉంటుందా?. ఇప్పుడు ఉన్న రాజ‌కీయాల్లో ప్ర‌త్యర్ధుల‌ను దెబ్బ‌కొట్ట‌కుండా పాపం..చంద్ర‌బాబు అని ఎవ‌రైనా వ‌దిలేస్తారా?. అక్క‌డ దాకా ఎందుకు చంద్ర‌బాబు త‌న‌కు అవ‌కాశం ఉంటే రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల‌ను దెబ్బ‌తీయ‌రా?.

Next Story
Share it