Top
Telugu Gateway

లక్ష్మీస్ ఎన్టీఆర్ కు సెన్సార్ క్లియరెన్స్

లక్ష్మీస్ ఎన్టీఆర్ కు సెన్సార్ క్లియరెన్స్
X

‘నిజం గెలిచింది. ’ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు సెన్సార్ కూడా క్లియర్ చేసింది అని ఈ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ సినిమా ప్రారంభం నుంచి పలు వివాదాలు ఎదురైన విషయం తెలిసిందే. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ ఎలాగైనా సినిమా విడుదలను అడ్డుకునేందుకు పలు ప్రయత్నాలు చేసింది. కొంత మంది హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే కోర్టు కూడా భావప్రకటనా స్వేచ్చను అడ్డుకోవాల్సిన అవసరం లేదని..ఏదైనా శాంతి, భధ్రతల సమస్యలు వస్తే ఆయా ప్రభుత్వాలు చూసుకుంటాయని వ్యాఖ్యానించింది.

దీనిపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి సోమవారం నాడు అమరావతిలో ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలసి వివరణ ఇచ్చారు. తన వివరణపై సీఈవో ద్వివేది సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన తర్వాత మీడియాకు తెలిపారు. చెప్పారు. అన్ని వైపుల నుంచి లైన్ క్లియర్ కావటంతో ఈ సినిమా మార్చి 29న విడుదల కానుంది.

Next Story
Share it