ఏపీలో ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
BY Telugu Gateway1 March 2019 9:25 AM GMT

X
Telugu Gateway1 March 2019 9:25 AM GMT
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఐదు సీట్లకు ఐదుగురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయటం..అన్నీ సక్రమంగా ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. నామినేషన్ల పరిశీలన అనంతరం ఎన్నికల సంఘం ఈ ప్రకటన చేసింది. దీంతో టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్టు ఈసీ శుక్రవారం ప్రకటించింది.
Next Story