Telugu Gateway
Cinema

118 మూవీ రివ్యూ

118 మూవీ రివ్యూ
X

నందమూరి కళ్యాణ్ రామ్. గత కొంత కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో.చేసిన సినిమాలు అన్నీ అలా అలా వచ్చిపోతున్నాయే తప్ప..ఒక్కటంటే ఒక్క హిట్ పడటం లేదు. దీంతో ఈ సారి భిన్నమైన సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడు. అదే 118. ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మరోసారి జర్నలిస్టు పాత్రలో కన్పించాడు. నిత్యం లాజిక్ ప్రకారం ముందుకెళ్ళే హీరో..ఏ మాత్రం లాజిక్ లేని అంశంపై ఫోకస్ పెట్టడం అనే లైన్ తో సినిమా కథను నడిపించాడు దర్శకుడు. హీరో కళ్యాణ్ రామ్ (గౌతమ్) ఓ ఛానల్ లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తాడు. ఓ సమయంలో గౌత‌మ్ రిసార్ట్ లోని 118 అనే రూమ్‌లో బస చేస్తాడు. రాత్రి 1.18 నిమిషాల‌కు అత‌నికి ఓ క‌ల వ‌స్తుంది. మ‌రో సారి కూడా అదే రిసార్ట్ లో స్టే చేసిన అత‌నికి అదే క‌ల మ‌ళ్ళీ వ‌స్తుంది. దీంతో త‌న‌కు వ‌చ్చిన క‌ల గురించి ఆలోచించ‌డం మొద‌లుపెడ‌తాడు. అస‌లు ఆ క‌ల ఏంటి? ఎందుకు వ‌చ్చింది? క‌ల‌లో ఉన్న అమ్మాయి ఎవ‌రు? వాటి వెనుక ఉన్న వాస్త‌వాలేంటి? అన్న సస్పెన్స్ ను విప్పేదే '118' సినిమా.

జర్నలిస్ట్ పాత్రలో కల్యాణ్‌ రామ్‌ మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ సారి స్టైలిష్‌ పాత్రలో మరింతగా ఆకట్టుకున్నాడు. పర్ఫామెన్స్‌, యాక్షన్‌ సీన్స్‌ లోనూ మెరుగైన నటన చూపించాడు. నివేదా థామస్ నటన సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. ఆమె తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా సినిమాకు ఇదే కీలకం. హీరోయిన్‌ షాలిని పాండే పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా ఉన్న కాసేపు మంచి నటనతో మెప్పించింది. ఇతర పాత్రల్లో హరితేజ, ప్రభాస్‌ శ్రీను, నాజర్‌ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సినిమాటోగ్రాఫర్‌గా టాలీవుడ్‌కు సుపరిచితుడైన కేవీ గుహన్‌, 118 సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010 ఓ తమిళ సినిమాను డైరెక్ట్ చేసిన గుహన్‌ లాంగ్ గ్యాప్‌ తరువాత తెలుగు సినిమాతో మరోసారి మెగా ఫోన్‌ పట్టుకున్నాడు. రొటీన్‌ ఫార్ములా సినిమాకు భిన్నంగా ఓ సైన్స్‌ ఫిక్షన్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫస్ట్‌ హాఫ్ అంతా పరుగులు పెట్టిన సినిమా సెకండాఫ్ లో నెమ్మదిస్తుంది. సినిమాటోగ్రఫి పరంగా మాత్రం గుహన్ ఫుల్‌ మార్క్స్‌ సాధించాడు. స్టైలిష్‌ టేకింగ్‌తో మెప్పించాడు. ఓవరాల్ గా చూసుకుంటే నందమూరి కళ్యాణ్ రామ్ కు 118 మరో యావరేజ్ సినిమాగా చెప్పుకోవచ్చు.

రేటింగ్. 2.25/5

Next Story
Share it