జగన్ కీలక ప్రకటన

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోక వస్తే వృద్ధాప్యపెన్షన్ ను మూడు వేలు చేస్తామని ప్రకటించారు. ఇటీవల వరకూ వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ ను చంద్రబాబు సర్కారు రెండు వేలకు పెంచిఅమలు కూడా ప్రారంభించింది. కొద్ది రోజుల క్రితమే జగన్ నవరత్నాల కింద ఈ పథకాన్ని ప్రకటించారు. ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి గెలవాలనే తపనతో చంద్రబాబుముందుగానే పెన్షన్ పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. . బుధవారం తిరుపతి సమీపంలో జరిగిన వైఎస్సార్ సీపీ సమర శంఖారావం సభలో జగన్ ఈ హామీ ఇచ్చారు.
అంతేకాకుండా రైతులను ఆదుకునేందుకు ప్రతి మే నెలలో రూ.12,500 సాయం అందిస్తామని తెలిపారు.ప్రస్తుతం ఉన్న పింఛన్ల వయస్సు 65 నుంచి 60కి తగ్గిస్తామని, అలాగే వికలాంగులకు పింఛన్ రూ.3వేలు ఇస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అలాగే 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశలవారీగా రూ.75వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు .