Telugu Gateway
Telangana

మెట్రో లిఫ్ట్ ల్లో కౌగిలింతలు..ముద్దులు

మెట్రో లిఫ్ట్ ల్లో కౌగిలింతలు..ముద్దులు
X

అవి హైదరాబాద్ మెట్రో రైలు లిఫ్ట్ లు. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. ఇదే ఛాన్స్ అనుకుంటున్నారు కొంత మంది యువత. తమకు ఏకాంతమైన ప్లేస్ దొరికింది అనుకుని..అక్కడే కౌగిలింతలు..ముద్దులు పెట్టేసుకుంటున్నారు. ఎవరూ ఛూడటం లేదు కదా? అని తమ ముద్దుల పనులు కానిచ్చేసుకుని..అక్కడ నుంచి మెల్లగా జారుకుంటున్నారు.

కానీ మెట్రో స్టేషన్లలో ప్రతి కదలిక సీసీటీవీల్లో రికార్డు అవుతుందనే విషయం యువత మర్చిపోతుంది. అంతే కాదు..ఈ కిస్సింగ్ ల వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుండటంతో వారు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే విషయం తెలుసుకున్న మెట్రో అధికారులు పబ్లిక్ ప్లేస్ ల్లో హుందాగా ఉండాలంటూ బోర్డులు పెట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Next Story
Share it