రాహుల్ గాంధీకి ఊహించని ముద్దు
BY Telugu Gateway14 Feb 2019 1:39 PM GMT

X
Telugu Gateway14 Feb 2019 1:39 PM GMT
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊహించని సంఘటన ఎదురైంది. గుజరాత్ లోని వల్సాద్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు మహిళలు దండ వేసేందుకు వచ్చారు. వారి రాకను గమనించిన రాహుల్ లేచి నిలుచున్నారు. అంతలోనే ఓ మహిళ రాహుల్ గాంధీకి ముద్దు పెట్టారు. ఈ ఘటనతో అక్కడ ఉన్న వారంతా ఒకింత షాక్ కు గురయ్యారు. అయితే రాహుల్ మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా తన కార్యక్రమం పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో..ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story