దటీజ్...విజయ్ దేవరకొండ
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు. పెద్ద హీరోలం అని తొడలు కొట్టే వారి కంటే ముందుగా తన వంతు కాశ్మీర్ లో చనిపోయిన సైనికులకు సాయం చేశారు. తాను సాయం చేసి..అందరూ ఆ దిశగా ముందుకు రావాలని పిలుపునిచ్చి ఆదర్శంగా నిలిచారు. అయితే తాను ఎంత మొత్తం సాయం చేశాననే విషయాన్ని ప్రచారానికి వాడుకోకుండా..ఆ మొత్తాన్ని బ్లాక్ చేసి...సర్టిఫికెట్ ను మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు ఈ సంచలన హీరో. ట్విట్టర్లో సానుభూతి వచనాలు పలకటం కాకుండా తన వంతుగా సాయం చేసి మరోసారి విజయ్ తన ప్రత్యేకత చాటుకున్నాడనే అభినందనలు అందుకుంటున్నాడు ఈ కుర్ర హీరో.
‘మన సైనికుల జీవితాలను సాయంతో వెలకట్టలేం. కానీ మనం మనవంతు సహకారం అందించాలి. నావంతు సహకారం నేను అందించా. మనందరం కలిసి సాయం చేద్దాం. మనమంతా కలిసి వారికో పెద్ద సపోర్ట్ ని క్రియేట్ చేద్దాం’’ అని ట్వీట్ చేశాడు ఈ హీరో. మరి విజయ్ మాటను స్పూర్తిగా తీసుకుని ఎంత మంది ముందుకు వస్తారో వేచిచూడాల్సిందే. జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 44 మందికి పైగా సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.