టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఖరారు
BY Telugu Gateway22 Feb 2019 5:43 PM IST

X
Telugu Gateway22 Feb 2019 5:43 PM IST
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అభ్యర్ధులను ఖరారు చేసింది. ఈ కోటాలో రానున్న ఐదు సీట్లకూ పార్టీ అభ్యర్ధులను టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ ప్రకటించారు. కొత్తగా ఎమ్మెల్సీ పదవులు దక్కించుకోనున్న వారిలో ప్రస్తుత హోం శాఖ మంత్రి మహమూద్ అలీతో పాటు ఎగ్గే మల్లేశం కురుమ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ ఉన్నారు. మరో సీటును మిత్రపక్షం ఎంఐఎంకు కేటాయించాలని కెసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
అయితే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా తాము బరిలో అభ్యర్ధిని పెడతామని ప్రకటించింది. శాసనసభలో ఆ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేశారు. బలం లేకపోయినా కెసీఆర్ ఐదుగురు అభ్యర్ధులను ప్రకటించారని..తమకు అభ్యర్ధికి కావాల్సిన బలం ఉందని అన్నారు. పార్టీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
Next Story



