ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతి
BY Telugu Gateway22 Feb 2019 3:37 PM IST

X
Telugu Gateway22 Feb 2019 3:37 PM IST
శత చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన దర్శకత్వంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో కోడి రామకృష్ణ జన్మించారు. ఆయన మృతితో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగింది.
పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఆయన అమ్మోరు, దేవి, అరుంధతి లాంటి ఫాంటసీ చిత్రాలను తెరకెక్కించారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమైన ఆయన వంద చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. 2016లో కన్నడ చిత్రమైన ‘నాగహారవు’ ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమాగా నిలిచింది.
Next Story



