Telugu Gateway
Cinema

‘సైరా’ షూటింగ్ కు అడ్డంకులు

‘సైరా’ షూటింగ్ కు అడ్డంకులు
X

చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చారిత్రక సినిమా ‘సైరా’ నరసింహరెడ్డి. ఈ సినిమా షూటింగ్ కు బీదర్ లో అడ్డంకులు ఎదురయ్యాయి. అన్ని అనుమతులు తీసుకుని అంతా రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో కొంత మంది యువకులు షూటింగ్ కు అంతరాయం కలిగించారు. బీదర్ లో ఉన్న బహమనీ కోటలో షూటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా హిందూ దేవతల విగ్రహాలను పెట్టారు. అయితే ముస్లింల కోటలో హిందూ దేవల విగ్రహాలు పెట్టడం ఏంటని నిలదీస్తూ కొంత మంది యువత ఆందోళనకు దిగి..చిత్ర యూనిట్ ను వాగ్వాదానికి దిగారు.

వివాదం మరింత పెరగకుండా పోలీసులు దేవతల విగ్రహాలను అక్కడ నుంచి తొలగించారు. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబచ్చన్ తో పాటు నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. తెలుగుతోపాటు తమిళం, మళయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు.

Next Story
Share it