Telugu Gateway
Cinema

హీరోయిన్లపై బాలసుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు

హీరోయిన్లపై బాలసుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు
X

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం హీరోయిన్లకు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో తెలియటం లేదు. కార్యక్రమాలకు హాజరయ్యేటప్పుడు వారి ధోరణి విచిత్రంగా ఉంటోంది. ఇది వాళ్ళ అమాయకత్వం అనుకోవాలో..లేక ఇలాంటి దుస్తులు వేసుకుంటే అవకాశాలు వస్తాయని భావిస్తున్నారో తెలియదు అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై హీరోయిన్లకు కోపం వచ్చినా పర్వాలేదని..చాలా మంది హీరోయిన్లకు తెలుగు రాదు కాబట్టి తన మాటలు వాళ్ళకు ఆర్ధం కావన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బాలసుబ్రమణ్యం ఈ వ్యాఖ్యలు చేశారు. సహజంగా మహిళల డ్రెస్ లపై ఎవరు వ్యాఖ్యానించినా మండిపడే నటీమణులు ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు.

https://www.youtube.com/watch?v=mxmtVH9s3l8

Next Story
Share it