Telugu Gateway
Cinema

సోనాక్షి సిన్హాపై కేసు

సోనాక్షి సిన్హాపై కేసు
X

బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా చిక్కుల్లో పడ్డారు. ఆమెపై ఓ ఈవెంట్ మేనేజర్ కేసు పెట్టారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు 37 లక్షల రూపాయలు తీసుకుని..ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. అదే సమయంలో సోనాక్షి సిన్హా రవాణా, బస సౌకర్యాల కోసం తాను తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు ఈవెంట్ మేనేజర్ ప్రమోద్ శర్మ చెబుతున్నారు. మొరాదాబాద్ లో ఈ కేసు నమోదు అయింది.

ఆమెను ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించానని..ఈవెంట్ కు రాకపోతే తనకు బారీ నష్టం వస్తుందని కూడా చెప్పినట్లు ఈవెంటర్ నిర్వాహకుడు వాపోయారు. అయినా సరే ఆమె కార్యక్రమంలో పాల్గొనటానికి ఆసక్తిచూపలేదని వెల్లడించారు. దీంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో కేసు పెట్టాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై సోనాక్షి సిన్హా ఇంత వరకూ స్పందించలేదు.

Next Story
Share it