మమతాకు సుప్రీంలో షాక్

గత కొన్ని రోజులుగా సాగుతున్న పశ్చిమ బెంగాల్ వర్సెస్ సీబీఐ పోరులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్. ఈ వివాదంపై సీబీఐ దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు మంగళవారం నాడు విచారింది. ఈ సందరర్భంగా సీబీఐ విచారణ ముందు కోల్ కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కపూర్ హాజరుకావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ విచారణకు ఆయన సహకరించాలని..విచారణకు సహకరిస్తే అరెస్టు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అదేస సమయంలో సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతోపాటు కమిషనర్ కు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 20న జరగనుంది.
సీబీఐ అధికారులు శారదా చిట్ స్కాంలో కోల్ కతా కమిషనర్ ను విచారించేందుకు రాగా..వారిని కోల్ కతా పోలీసులు అడ్డుకోవటంతోపాటు..సీబీఐ అధికారులను ఏకంగా పోలీసు స్టేషన్ కు తరలించిన సంగతి తెలిసిందే. అప్పుడే ఏకంగా సీఎం మమతా బెనర్జీ కమిషనర్ ఇంటికి రావటం..సీబీఐ చర్యలను నిరశిస్తూ దీక్షకు దిగటం తెలిసిందే. ఈ కేసును విచారించిన సుప్రీం కోల్‌కతా కమిషనర్ రాజీవ్‌ను విచారించే అధికారం సీబీఐకి ఉందని, అయితే ఇప్పటికిప్పుడు కోల్‌కతా కమిషనర్‌ను అరెస్ట్ చేయవద్దని సూచించింది. అటు ఢిల్లీ, ఇటు కోల్‌కతాలో కాకుండా తటస్థ వేదికలో విచారణ జరపాలని సీబీఐని ఆదేశించింది. అయితే విచిత్రం ఏమిటంటే మమతా సుప్రీంకోర్టును తీర్పును స్వాగతించారు. ఇది తమ విజయంగా పేర్కొన్నారు.