సండ్రకు ఏపీ సర్కారు ఝలక్

సత్తుపల్లి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఏపీ సర్కారు ఝలక్ ఇఛ్చింది. తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు ఏపీ సర్కారు టీటీడీ బోర్డులో చోటు కల్పించింది. అయితే ఆయన పార్టీ మారి..మంత్రి పదవి దక్కించుకునే యోచనలో ఇంత కాలం టీటీడీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించలేదు. దీంతో ఆయన్ను టీటీడీ బోర్డు నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం నెలరోజుల్లో బాధ్యతలు తీసుకోవాల్సి ఉన్న సండ్ర...ఇంతవరకు బోర్డు సభ్యుడిగా బాధ్యతలు తీసుకోకపోవడంతో పాలక మండలి నుంచి ఆయనను ప్రభుత్వం తొలగించింది.
ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో సండ్ర వెంకట వీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన కనుక కారెక్కితే ఖమ్మం జిల్లా నుంచి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఫిబ్రవరి 19ని సీఎం కెసీఆర్ ముహుర్తంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.