Telugu Gateway
Cinema

‘ఆర్ఆర్ఆర్’ కూడా ఆ రేంజ్ సినిమానే

‘ఆర్ఆర్ఆర్’ కూడా  ఆ రేంజ్ సినిమానే
X

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా బాహుబలి రేంజ్ సినిమానే అంటున్నారు దర్శకుడు రాజమౌళి. తొలి సారి ఆయన ఈ సినిమాపై నోరు విప్పారు. హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2019లో పాల్గొన్న ఆయనకు ఈ సినిమాపై ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ మూవీ బాహుబలికి ఏమాత్రం తీసిపోదు.. ఈ చిత్రం బాహుబలి లాంటి లార్జ్‌ స్కేల్‌ ఉన్న చిత్రమనీ.. ఇది కూడా పాన్‌ ఇండియా మూవీ అని తేల్చేశారు. ఈ సినిమాపై అధికారిక ప్రకటనలు ఏమీ లేకపోయినా నిత్యం ఏదో ఒక వార్త దీనికి సంబంధించి హల్ చల్ చేస్తూనే ఉంది.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా రెండు భాగాలు దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించటంతోపాటు..కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు నెలకొల్పాయి. తెలుగు సినిమా రేంజ్ ను ఆమాంతం పెంచాయి. ఆర్ఆర్ఆర్ మూవీలో టాలీవుడ్ లో టాప్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుమారు 300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇది తెరకెక్కుతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా రాబోయే రోజుల్లో ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it