Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు ఓటు ఎందుకేయాలి?

చంద్రబాబుకు ఓటు ఎందుకేయాలి?
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో మహిళలతోపాటు అన్ని వర్గాల వారు కష్టాలు పడ్డారని ఆరోపించారు. అసలు చంద్రబాబుకు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. మరోసారి డ్వాక్రా మహిళలను మోసం చేసేందుకు చంద్రబాబు రెడీ అయిపోయారని ఎద్దేవా చేశారు. పోస్ట్ డేటెడ్ చెక్కులతో ఆయన ఔట్ డేటెడ్ సీఎంగా మారిపోయారన్నారు. ఒక్క ఫిబ్రవరి నెల చెక్కులు మాత్రమే చెల్లుబాటు అవుతాయని...తర్వాత ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి..నెపాన్ని బిజెపి, ఎన్నికల సంఘంపై నెట్టి చంద్రబాబు తప్పించుకుంటారని రోజా విమర్శించారు.

ఏపీలో డ్వాక్రా రుణాలు మాఫీ చేసి ఉంటే రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల ఆత్మహత్యలు ఉండేవికావని అన్నారు. టీడీపీ అరాచకాలను తట్టుకోలేని మహిళలు.. మంత్రి పరిటాల సునీతపై చెప్పులు, చీపుర్లతో తిరుగుబాటు చేశారని గుర్తుచేశారు. మహిళలకు న్యాయం చేయలేని సునీత.. వైఎస్‌ జగన్‌ను విమర్శించడం తగదని హితవుపలికారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయగల సత్తా మీకు ఉందా ఉంటూ సవాలు చేశారు. నరకాసుర పాలన చేస్తున్న చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలని రోజా పిలుపునిచ్చారు. వైస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే నవరత్నాలు అమలుచేసి తీరుతామని ఆమె హామీ ఇచ్చారు.

Next Story
Share it