లెస్బియన్ పాత్రలో రెజీనా
BY Telugu Gateway2 Feb 2019 11:25 AM IST
X
Telugu Gateway2 Feb 2019 11:25 AM IST
టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ హిట్లు అందుకోలేకపోయిన హీరోయిన్ రెజీనా. అయినా వచ్చిన ఏ పాత్ర కూడా వదలకుండా చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఆ! సినిమాలో ఓ విభిన్నమైన పాత్ర చేసింది. ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెట్టి సంచలన పాత్ర చేసింది. అదేంటి అంటే ఓ లెస్బియన్ పాత్ర. ఏక్ లడఖీ కో దేఖాతో ఐసా లగా’ సినిమాలో ఆమె ఈ ఫాత్ర పోషించింది. అనిల్ కపూర్, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో రెజీనా పాత్ర నిడివి తక్కువే అయినా మంచి ఆదరణ పొందుతోంది.
ప్రధాన పాత్రలో నటించిన సోనమ్ కపూర్ ప్రియురాలిగా రెజీనా నటించారు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఆ! సినిమాలో నిత్యామీనన్ కూడా ఇలాంటి పాత్రనే పోషించిన సంగతి తెలిసిందే. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్న సన్నివేశాలు ఆ సినిమాలో ఉన్న విషయం తెలిసిందే.
Next Story