Telugu Gateway
Politics

తెలంగాణ డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్

తెలంగాణ డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్
X

తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పద్మారావుగౌడ్ ఎన్నిక లాంఛనమే. ఆయన ఎన్నికకు ప్రతిపక్షాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఏకగ్రీవంగా ఆయన ఈ పదవికి ఎన్నిక కానున్నారు. పద్మారావు గౌడ్ గత కెసీఆర్ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేశారు. ఈ సారి మాత్రం పద్మారావు గౌడ్ ను సీఎం డిప్యూటీ స్పీకర్ పదవి అప్పగించాలని నిర్ణయించారు. శాసనసభ కార్యదర్శి కార్యాలయంలో పద్మారావు గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు.

దీనికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు ఎరబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు శ్రీధర్ బాబు, ఎంఐఎం సభ్యులు అహ్మద్ బలాల, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ భాస్కర్. నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి నర్శింహా చార్యూలుకు అందజేశారు. సోమవారం ఈ ఎన్నికను ప్రకటించనున్నారు.

Next Story
Share it