జగన్ తో అక్కినేని నాగార్జున భేటీ
BY Telugu Gateway19 Feb 2019 11:12 AM GMT

X
Telugu Gateway19 Feb 2019 11:12 AM GMT
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో మంగళవారం నాడు సినీ హీరో నాగార్జున భేటీ అయ్యారు. గత కొంత కాలంగా నాగార్జున లేదా అమలలు గుంటూరు ఎంపీ బరిలో నిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో జగన్, నాగార్జున భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంత కాలంగా వైసీపీలో వరస చేరికలు జరుగుతున్న సమయంలో నాగార్జున కూడా జగన్ ను కలవటం సంచలనంగా మారింది. సుమారు అరగంట పాటు జగన్-నాగార్జునల భేటీ జరిగింది. అయితే ఈ భేటీ అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడకుండా నవ్వుతూ వెళ్ళిపోయారు. అయితే వీరిద్దరి జరిగిన చర్చలు సారాంశం ఏమిటో వెల్లడి కావాల్సి ఉంది.
Next Story