వైసీపీ అభ్యర్ధుల ఎంపికకు మోడీ..కెసీఆర్ సహకారం
BY Telugu Gateway16 Feb 2019 10:22 AM IST

X
Telugu Gateway16 Feb 2019 10:22 AM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం నాడు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చేసిన వ్యాఖ్యలు ఇవి. అంతే కాదు..జగన్ కు అమరావతిలో ఉండటం ఇష్టంలేదని..అందుకే పాదయాత్ర పూర్తి చేసుకుని హైదరాబాద్ లో ఉంటున్నారని విమర్శించారు. డబ్బు సంచులు ఎవరు ఎక్కువ ఇస్తే వారికే జగన్ టిక్కెట్లు ఇస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
జగన్ దృష్టిలో రాజకీయం అంటే వ్యాపారం అని విమర్శించారు. వైసీపీ అభ్యర్ధులు ఎప్పుడైనా వన్ టైమ్ ప్లేయర్స్ మాత్రమే అని ఎద్దేవా చేశారు. జైలు వెళ్ళిన వాళ్ళు..వ్యాపారులకు మాత్రమే వైసీపీ టిక్కెట్లు ఇస్తుందని విమర్శించారు. ఏపిలో అభివృద్దిని నరేంద్రమోది జీర్ణించుకోలేకపోతున్నారని..ఆంధ్రప్రదేశ్ అభివృద్ది తెలంగాణ సీఎ: కెసీఆర్ కూడా కంటగింపుగా ఉందన్నారు.
Next Story



