Telugu Gateway
Cinema

‘మహానాయకుడు’ ప్రొమో విడుదల

‘మహానాయకుడు’ ప్రొమో విడుదల
X

ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించిన రెండవ భాగం ‘మహానాయకుడు’ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ‘ప్రొమో’ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. అయితే ఇందులో ఒకే డైలాగ్ పదే పదే చెప్పటంతో కొత్తదనం ఏమీ లేకుండా పోయిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. పైగా ఈ డైలాగ్ ఫస్ట్ పార్ట్ కథానాయకుడులోనూ వాడిందే కావటం విశేషం. ‘నీకూ..నాకూ రెండు ఇష్టాలుంటాయా బావా’ డైలాగ్ ఈ ప్రొమోలో ఉంది.

కొద్ది రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఫిబ్రవరి మొదటి వారంలోనే సినిమా విడుదల కావాల్సి ఉన్నా..వాయిదాలు పడుతూ వచ్చింది. తొలి భాగం సినిమా కలెక్షన్ల పరంగా భారీ నిరాశనే మిగిల్చింది. మరి ఈ రెండవ భాగం ఎలా ఉంటుందో అన్న టెన్షన్ ఎన్టీఆర్ అభిమానుల్లో నెలకొంది.

https://www.youtube.com/watch?v=iOtDe_e3SC0

Next Story
Share it