ప్రియా ‘లవర్స్ డే టీజర్’ వచ్చేసింది
ప్రేమికుల రోజు అంటే కొన్ని గుండెల వేగం పెరుగుతుంది. అప్పటికే ప్రేమలో ఉన్నవారు ఆ రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలా? అనే ప్లాన్స్ లో ఉంటారు. కొత్తగా తమ ప్రేమను వ్యక్తం చేయాలనుకునేవారికి ఉండే టెన్షన్ అంతా ఇంతా కాదు. అసలు తమ ప్రేమను ఆ అమ్మాయి ఓకే చేస్తుందా?. లేదా? అన్న టెన్షన్ అబ్బాయిల్లో మాత్రమే ఎక్కువ. అందుకే వాళ్ళ గుండెల వేగం పెరుగుతుంది. ఈ సారి ప్రేమికుల దినోత్సవానికి ఓ ప్రత్యేకత ఉంది. ఒక్క కన్ను గీటుతో యూత్ మొత్తాన్ని అలా పడేసిన ‘ప్రియావారియర్’ నటించిన సినిమా విడుదల అవుతోంది.
సినిమాకు సంబంధించి టీజర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ప్రియా వారియర్ నటించిన తొలి చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా విడుదల చేసిన టీజర్ డైలాగ్ లు అత్యంత రొటీన్ గా...కృతకంగా ఉన్నాయి. ఈ టీజర్ లో హీరో..హీరోయిన్ల లిప్ లాక్ ఉండటం విశేషం.
https://www.youtube.com/watch?time_continue=54&v=ldK_hZq7VWU