Top
Telugu Gateway

యాక్షన్ ఆమె చేసింది..పేరు ప్రియాకొచ్చింది

యాక్షన్ ఆమె చేసింది..పేరు ప్రియాకొచ్చింది
X

ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె దేశంలో చాలా మందికి తెలుసు. నూరిన్ షెరీఫ్. ఈమె చాలా మందికి తెలియదు. తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదలైన మళయాళ సినిమా ఒరు ఆడార్ లవ్ తో నూరిన్ షెరీఫ్ వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఈ సినిమాలో అసలు హీరోయిన్ నూరిన్ షెరీఫే. సినిమాలో ప్రియాతో పోలిస్తే ఆమె యాక్షన్ సూపర్ గా ఉంది. హావభావాలు పలికించటంతోపాటు..నటనలో ఎంతో ఈజ్ చూపించింది నూరిన్ షెరీఫ్. అయితే ఈ సినిమా ప్రియా, నూరిన్ మధ్య గ్యాప్ పెంచినట్లు కన్పిస్తోంది. ప్రియా కారణంగా సినిమాలో తన రోల్ అంతా కట్ చేయటంతోపాటు..కథలో కూడా మార్పులు చేశారని అసలు హీరోయిన్ ఇప్పుడు లబోదిబోమంటోంది.

అయితే ఆమె బాధలో వాస్తవం ఉందనే చెప్పొచ్చు. సినిమాలో ప్రియా పాత్ర కంటే నూరిన్ పాత్రే హైలెట్ గా ఉంది. అయితే దర్శకుడు ఒమర్ లూలు ప్రియా వారియర్ కన్నుగీటునే నమ్ముకున్నాడు తప్ప కథలో దమ్ములేకపోవటంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. తెలుగులోనూ ఈ సినిమాకు కలెక్షన్లు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. అయితే హీరో రోషన్ తో కలసి మరో సినిమా చేయాలని ఉందని నూరిన్ చెబుతోంది. ప్రియాతో మళ్ళీ కలసి నటిస్తారా? అని ప్రశ్నించగా..సమాధానం చెప్పకుండా దాటేసింది.

Next Story
Share it