Telugu Gateway
Cinema

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పాట వచ్చేసింది

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పాట వచ్చేసింది
X

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి చూపు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వైపే. ఎన్టీఆర్ సినీ, రాజకీయ చరిత్రలతో బాలకృష్ణ తెరకెక్కించి, నటించిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. అయితే బాలకృష్ణ ఆపిన చోటు నుంచే వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ పెద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఓ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతిల మధ్య ఉన్న ప్రేమానురాగాల నేపథ్యంలో తెరకెక్కించిన ప్రణయ గీతాంన్ని చేశాడు. ‘నీ ఉనికి నా జీవితానికి అర్థం’ అంటూ సాగే ఈ పాటకు సిరా శ్రీ సాహిత్యమందించగా లెజెండరీ సింగర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. కల్యాణీ మాలిక్‌ సంగీతమందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చిలో విడుదల కానుంది.

https://www.youtube.com/watch?time_continue=129&v=mdFHHAidSrY

Next Story
Share it