Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ ఆశీస్సులు మాకే

ఎన్టీఆర్ ఆశీస్సులు మాకే
X

దీనికి ఇంత కంటే నిదర్శనం ఏమి కావాలి అంటున్నారు వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన తాజాగా విడుదల చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ దుమ్మురేపుతోంది. రెండు రోజుల్లోనే వివిధ ఫ్లాట్ ఫాంలపై కలుపుకుని ఏకంగా కోటి మంది (పది మిలియన్లు) ఈ ట్రైలర్ ను వీక్షించారు. తాజాగా ఈ విషయాన్ని రామ్‌ గోపాల్‌ వర్మ అభిమానులతో పంచుకున్నారు.

రిలీజ్‌ అయిన గంటన్నరలోనే మిలియన్‌ వ్యూస్‌ సాధించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ట్రైలర్‌ రెండు రోజుల్లో కోటి వ్యూస్‌ సాధించినట్టుగా వర్మ ప్రకటించాడు. వివిధ యూట్యూబ్‌ చానల్స్‌ తో పాటు సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌ అన్నింటిలో కలిపి ఈ వ్యూస్‌ సాధించినట్టుగా వర్మ తెలిపాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్ మార్చి మొదటి వారంలో విడుదల కానుంది.

Next Story
Share it