Top
Telugu Gateway

కంగనా ‘కుండబద్దలు’ కొట్టారు

కంగనా ‘కుండబద్దలు’ కొట్టారు
X

మణికర్ణిక సినిమాకు సంబంధించి సాగుతున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ అంశంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తొలిసారి నోరువిప్పారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది నేనే. అంతే. ఇందులో ఎలాంటి మార్పు లేదు అంటూ వ్యాఖ్యానించారు. అయితే మణికర్ణిక సినిమాలో ఎక్కువ మొత్తం తానే పూర్తిచేశానని..తాను దర్శకత్వం వహించిన షాట్లనే మళ్లీ రీ షూట్ చేసి..కంగనా దర్శకత్వం వహించినట్లు చెప్పుకుంటోందని ప్రముఖ దర్శకుడు క్రిష్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పెద్ద దుమారమే సాగుతోంది. ఏది ఏమైనా సినిమా మాత్రం మంచి హిట్ టాక్ తో దూసుకెళుతోంది.

విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన కంగనా ఈ అంశంపై మాట్లాడుతూ దర్శకుడు క్రిష్ తనను టార్గెట్ చేయటం సరికాదన్నారు. ఆయన చెప్పేదే నిజం అయితే నిరూపించుకోమనండి అంటూ సవాల్ విసిరారు. మీడియాతో మాట్లాడటం వల్ల ఉపయోగం ఉండదన్నారు. కష్టపడి పైకి రావాలి కానీ..వేరే వాళ్ళను చూసి ఏడిస్తే ఉపయోగం ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు జాతీయ అవార్డులు కష్టార్జితంతో గెలుచుకున్నానని..అవేమీ మా నాన్న నాకివ్వలేదు అంటూ వ్యాఖ్యానించారు.

Next Story
Share it