తెలంగాణ లోక్ సభ బరిలో జనసేన
BY Telugu Gateway10 Feb 2019 1:54 PM GMT

X
Telugu Gateway10 Feb 2019 1:54 PM GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్న జనసేన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మాత్రం బరిలోకి దిగేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ దిశగా కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కమిటీల ఏర్పాటు ప్రారంభించింది. తాజాగా ఆ పార్టీ మెదక్, వరంగల్, నల్లగొండ, భువనగిరి లోక్ సభ నియోజకవర్గాలకు ఎగ్జిక్యూటివ్, వర్కింగ్ కమిటీలను ప్రకటించింది. ఇంతకు ముందే సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, ఖమ్మం స్థానాలకు కూడా కమిటీలు ప్రకటించారు. అయితే ఇక్కడ ఒంటరిగానే బరిలో ఉంటుందా?. లేక ఎవరితోనైనా పొత్తుతో పోటీ చేస్తారా? అన్నది వేచిచూడాల్సిందే.
Next Story