Telugu Gateway
Politics

ఆదాయ పన్ను పరిమితి 5 లక్షలకు పెంపు

ఆదాయ పన్ను పరిమితి 5 లక్షలకు పెంపు
X

సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్య తరగతి, ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చింది. ఆదాయ పన్ను పరిమితిని ఐదు లక్షల రూపాయలకు పెంచింది. ప్రస్తుతం ఇది 2.5 లక్షలు రూపాయలుగా మాత్రమే ఉంది. కేంద్ర బడ్జెట్ లో తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో దేశంలోని కోట్లాది మందికి ప్రయోజనం కలగనుంది. ఉద్యోగులకు కూడా ఇది చాలా పెద్ద రిలీఫ్ గా చెప్పుకోవచ్చు. తాజా నిర్ణయంతో ఐదు లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారు ఎలాంటి ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు.

ఉద్యోగులతోపాటు ఫించన్ దారులకు కూడా ఇది పెద్ద ఊరట. ఈ నిర్ణయంతో మూడు కోట్ల మంది ఉద్యోగులకు ఊరట లభిస్తుందని అంచనా. అదే సమయంలో ఎవరైనా ఫ్రావిడెంట్ ఫండ్ లో పెట్టుబడి పెడితే ఈ మొత్తం ఏకంగా 6.5 లక్షల రూపాయలకు పెంచారు. స్థూల ఆదాయం ఆరున్నర లక్షలు ఉన్నా ఎలాంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆదాయ పన్ను పరిమితి పెంచుతూ కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ప్రకటన చేయగానే సభ్యలందరూ పెద్ద పెట్టున సభలో నినాదాలు చేశారు.

Next Story
Share it