Telugu Gateway
Cinema

నవీన్ చంద్ర కొత్త సినిమా 28°C

నవీన్ చంద్ర కొత్త సినిమా 28°C
X

టాలీవుడ్ ఇప్పుడు ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతోంది. కొంత మంది యువ దర్శకులు కొత్త కొత్త కథలతో సినిమాలను తెరకెక్కిస్తూ సక్సెస్ లు సాధిస్తున్నారు. టైటిల్స్ విషయంలోనూ ఈ ట్రెండ్ కన్పిస్తోంది. ఓ వైపు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా కు వెరైటీగా 118 పేరు పెట్టారు. ఇప్పుడు మరో హీరో నవీన్ చంద్ర్ సినిమా టైటిల్ కూడా ఆసక్తిరేపుతోంది. అదే 28°C. కేవలం హీరోగానే చేస్తాననే పట్టింపు లేకుండా తనకు నప్పే పాత్రలను ఎంపిక చేసుకుంటూ ముందుకెళుతున్నారు నవీన్ చంద్ర.

ఆయన నటించిన తాజా సినిమా అరవింద సమేతలో నవీన్ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. నవీన్ హీరోగా 28°Cగా రాబోతోన్న ఈ చిత్రానికి అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించనుండగా.. సాయి అభిషేక్‌ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో షాలినీ హీరోయిన్‌గా నటిస్తోంది. నవీన్‌ చంద్ర మరో తాజా చిత్రం హీరో హీరోయిన్‌ రిలీజ్‌కు రెడీగా ఉంది.

Next Story
Share it